- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రులతో సీఎం భేటీ.. సింగపూర్ పెట్టుబడులపై ఆరా
అమరావతి వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన ముగించుకుని వచ్చిన మంత్రుల బృందంతో కీలక సమావేశం నిర్వహించారు. ..

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati) వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chief Minsiter Nara Chandrababu Naidu) సింగపూర్(Singapure) పర్యటన ముగించుకుని వచ్చిన మంత్రుల బృందంతో కీలక సమావేశం నిర్వహించారు. సింగపూర్‌లో వారు జరిపిన అధ్యయన విశేషాలను, అక్కడి ప్రభుత్వ పని తీరును సీఎం అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా నగరాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో సింగపూర్ అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను రాష్ట్రంలో ఎలా అమలు చేయాలనే అంశంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు.
కీలక రంగాలపై సీఎం ఆరా
అర్బన్ ప్లానింగ్, పారిశ్రామికాభివృద్ధి, సాంకేతిక సహకారం వంటి కీలక రంగాల్లో సింగపూర్‌తో కలిసి పనిచేసే అవకాశాలపై సీఎం ఆరా తీశారు. సింగపూర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలను మన పరిస్థితులకు అనుగుణంగా ఎలా మలచుకోవచ్చో చంద్రబాబుకు మంత్రులు వివరించారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని, ఆయా దేశాల సహకారంతో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.






