- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగపూర్ దేశాధ్యక్షుడితో చంద్రబాబు భేటీ
by Ajay Maddhiboyina |
సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సీఎంతో పాటు ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, టీజీ భరత్ పాల్గొన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సీఎంతో పాటు ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, టీజీ భరత్ పాల్గొన్నారు. సింగపూర్ నుండి ఏపీకి వివిధ రంగాలలో సహకారం, భాగస్వామ్యంపై నేతలు చర్చించారు. ఇదిలా ఉంటే పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు మూడు రోజులు సింగపూర్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో పలువురు మంత్రులతో ఇప్పటికే ఆయన సమావేశం అయ్యారు. పలు కంపెనీల అధినేతలను కలిసి పెట్టుబడులను ఆహ్వానించారు. చంద్రబాబుతో భేటీపై సింగపూర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మంత్రి టాన్సీ లెంగ్ నేడు కీలక ప్రకటన చేశారు. ఏపీ, అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ఫలప్రదం కావాలని ఆయన ఆకాంక్షించారు.
Next Story






