స్పీడు పెంచితే వాహనం సీజ్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

by Ajay Maddhiboyina |

స్పీడు పెంచితే వాహనం సీజ్ చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం సచివాలయంలో సీఎం అధ్యక్షతన రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. అతివేగాన్ని నియంత్రించడానికి వీలుగా ట్రాన్స్ పోర్ట్ వాహనాల్లో స్పీడ్ గవర్నర్ లను నిబంధనల మేరకు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు సూచించారు.

స్పీడు పెంచితే వాహనం సీజ్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: స్పీడు పెంచితే వాహనం సీజ్ చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం సచివాలయంలో సీఎం అధ్యక్షతన రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. అతివేగాన్ని నియంత్రించడానికి వీలుగా ట్రాన్స్ పోర్ట్ వాహనాల్లో స్పీడ్ గవర్నర్ లను నిబంధనల మేరకు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. వాహనాల వేగాన్ని ఎప్పటికప్పుడు గుర్తించేందుకు జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ఇరువైపులా ప్రతి అర కిలోమీటర్ పరిధిని కవర్ చేసేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

వాటిని ఆర్టీజీఎస్ తో అనుసంధానించడంతో పాటు వెహికిల్ ట్రాకింగ్ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అదే విధంగా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రోడ్ సేఫ్టీ ఏజెన్సీల నియామకం, రాష్ట్ర రహదారి భద్రతా నిధి, రహదారులపై బ్లాక్ స్పాట్లను సరిదిద్దడం, డ్రైవర్లకు శిక్షణ తదితర అంశాలపై సీఎం అధికారులతో సమీక్షించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ అంశాలపై పురోగతిని సమీక్షించుకునేలా రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

2025లో ఇప్పటి వరకు 15,462 రోడ్డు ప్రమాదాల్లో 6,433 మంది మరణించడం ఆందోళనకరం అని అన్నారు. వాటిలో మూడో వంతు ప్రమాదాలు ద్విచక్ర వాహనాల వల్లనే జరిగాయని, 53 శాతం ప్రమాదాలు కార్లు, ద్విచక్ర వాహనదారుల సెల్ఫ్ యాక్సిడెంట్స్ ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. రోడ్డు ప్రమాదాల్లో ఏపీ దేశంలో 8వ స్థానంలో ఉండటంపై సీఎం ఆందోళన చెందారు. తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, పల్నాడు,కాకినాడ జిల్లాల్లో రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది మరణించడంపై ఆరా తీయాలన్నారు.

Next Story