పెద్ద దస్తగిరిని చంపింది వాళ్లే: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

పెద్ద దస్తగిరిని చంపింది వాళ్లే: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా(Kadapa District) పులివెందుల(Pulivendula)లో వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి(Pedda Dastagiri) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే అందుకు కారణం తెలుగుదేశం పార్టీ నాయకులేనని వైసీపీ(Ycp) నేతలు ప్రచారం చేయడంపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మంగళగిరిలో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంతపార్టీ నేతలనే చంపుకునే అలవాటు ఒక్క వైసీపీకి మాత్రమే ఉందన్నారు. డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, జగన్ మేనమామ రవీంద్ర నాథ్ రెడ్డి కలిసి కడపలో ప్రభుత్వ భూములు దోపిడీ చేశారని ఆరోపించారు. పంపకాల్లో విభేదాలు రావడంతో ఆ పార్టీ వాళ్లే పెద్దదస్తగిరి చంపారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వాళ్లు కార్యకర్తను వాళ్లే చంపి ఆ నేరాన్ని టీడీపీ నేతలపై నెట్టెస్తారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేరగాళ్లతో పోరాడలేదు

తన జీవితంలో రాజకీయ పోరాటాలు చేసేనే తప్ప నేరగాళ్లతో ఎప్పుడూ కూడా పోరాడలేదని సీఎం తెలిపారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని గొడ్డలి పార్టీ ఎమ్మెల్సీ హత్య చేశారని, కోర్టులో సాక్ష్యం చెప్పిన వారిని బెదిరించారని చంద్రబాబు చెప్పారు. కార్యకర్తలను కార్ల కింద తొక్కించి చంపేస్తారని, కానీ తన కారు కింద పడిపోయిన కార్యకర్తను మాత్రం పరామర్శించరని జగన్ ను ఉద్దేశించి విమర్శించారు. కిల్లర్ పార్టీతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజలను ఇబ్బంది పెడతారని, చర్యలు తీసుకుంటే రాజకీయమంటారని, అన్యాయం అంటూ పరామర్శకు వెళ్తారని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు.

Next Story