- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విచారణకే 30 ఏళ్లు పడుతుంది: జగన్ కేసులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
మాజీ సీఎం జగన్ కేసులపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు..

దిశ,వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Ap Former Cm Jagan Mohan Reddy) కేసుల విచారణకు 30 ఏళ్లు పడుతుందని సీఎం చంద్రబాబు నాయుడు(Chief Minister Chandrababu) తెలిపారు. పశ్చిమగోదారి జిల్లా పోలవరం(Polavaram)లో ఆయన పర్యటించిన నేపథ్యంలో ఆయన జగన్ కేసులను గుర్తుకు తీసుకొచ్చారు. జగన్ అక్రమాలపై విచారణలతో కాలయాపన చేయలేమని తెలిపారు. జగన్ ఒకటి, రెండు కాదని, వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలు
కాగా తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి(Ys Rajasekhar Reddy) అధికారంలో ఉన్న సమయంలో వైఎస్ జగన్ భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆభియోగాలున్నాయి. అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని కేసులు నమోదు చేశారు. ఆ కేసులన్నింటిలోనూ విచారణ జరుగుతుంది. జగన్ మోహన్ రెడ్డి 16 నెలలు పాటు జైల్లో సైతం గడిపారు. దీంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై 31 కేసులున్నాయని టీడీపీ నేతలు విమర్శలు చేశారు. ప్రస్తుతం ఈ కేసులపై సీఎం చంద్రబాబు స్పందించారు.






