రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు.. బ్యాంకర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |

రైతు ఆత్మహత్యలపై బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు...

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు.. బ్యాంకర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఆర్థిక నష్టాలతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే రైతు ఆత్మహత్యలను నివారించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బ్యాంకులు(Banks) ద్వారా రుణాలు ఇప్పించి అండగా నిలవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) సోమవారం అమరావతిలో ఎస్ఎల్బీసీ సమావేశం(SLBC Meet) నిర్వహించారు. ఈ సమావేశంలో పలు బ్యాంకుల ప్రతినిధులు సైతం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు(Cm Chandrababu) కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు కనిపించకూడదని ఆదేశించారు. హార్టికల్చర్(Horticulture ), ప్రకృతి సాగు(Nature Cultivation)కు బ్యాంకులు మద్దతు ఇవ్వాలని సూచించారు. ప్రజల ఆహారపు అలవాట్లు చాలా వరకూ మరిపోయాయని, అగ్రికల్చర్(Agriculture) స్థానంలో హార్టికల్చర్ వస్తోందన్నారు. చిన్న తరహా పరిశ్రమలకు రుణాలను కేంద్రం సరళతరం చేసిందని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్-2047(Golden Vision-2047) ప్రయాణంలో బ్యాంకర్లు భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రైతుల పేరుతో గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని, విచారణకు బ్యాంకులు సహకరించాలని కోరారు. అంతేకాదు దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇవ్వాలని బ్యాంకర్లకు చంద్రబాబు నాయుడు సూచించారు.

Next Story