టీడీపీ నేతలకు అదిరిపోయే శుభవార్త.. త్వరలోనే ఆ పదవుల భర్తీ

by velandi.Saikiran |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Cm Chandrababu)అదిరిపోయే శుభవార్త చెప్పారు. తెలుగుదేశం పార్టీ

టీడీపీ నేతలకు అదిరిపోయే శుభవార్త.. త్వరలోనే ఆ పదవుల భర్తీ
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Cm Chandrababu)అదిరిపోయే శుభవార్త చెప్పారు. తెలుగుదేశం పార్టీ నేతలకు త్వరలోనే నామినేటెడ్ పదవులు ( Nominated posts) రాబోతున్నాయని ప్రకటించారు. కూటమి ప్రభుత్వంలో భాగంగా ఇప్పటికే మూడు పార్టీలకు సంబంధించిన నేతలకు నామినేటెడ్ పదవులు దక్కిన సంగతి తెలిసిందే. ఇందులో మరికొన్ని పదవులు ఖాళీగా ఉన్నాయని సమాచారం.

అయితే దీనిపైన తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీ ( TDP) కీలక నేతలతో ఆదివారం రోజున టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా టీడీపీ మహానాడు ( TDP Mahanadu) నిర్వహించే వేదికలను అలాగే తేదీలను ప్రకటించారు. సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ప్రకారం... మే 27, 28 అలాగే 29 తేదీలలో కడప జిల్లాలో మహానాడు నిర్వహించబోతున్నారు.

మహానాడు కార్యక్రమం తర్వాత రాష్ట్ర కమిటీ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. మిగిలిన నామినేటెడ్ పదవులను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. మే 18 వ తేదీ నాటికి రాష్ట్ర కమిటీలు మినహా అన్ని కమిటీలు పూర్తి చేస్తామని కూడా... ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. దీంతో తెలుగు తమ్ముళ్లలో కొత్త ఉత్సాహం నెలకొంది.

Next Story