11న సీఎం చంద్రబాబు కీలక సమావేశం.. మంత్రులు, కార్యదర్శులతో భేటీ

by Thanuru Gopichand |

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 11న సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

11న సీఎం చంద్రబాబు కీలక సమావేశం..   మంత్రులు, కార్యదర్శులతో భేటీ
X

దిశ, డైనమిక్​బ్యూరో : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 11న సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రులు, కార్యదర్శులతో పాలన అంశాలపై చర్చిస్తారు. సీఎం అధ్యక్షతన రెండు సెషన్లుగా సమావేశం జరగనుంది. తొలి సెషన్​లో ఫైళ్ల క్లియరెన్స్​, జీఎస్​డీపీపై చర్చిస్తారు. వాట్సప్​గవర్నెన్స్​, మిషన్​ కర్మయోగిపై కూడా చర్చించనున్నారు. త్వరలో ప్రవేశ పెట్టబోయే ఏపీ బడ్జెట్​పై రెండో సెషన్​లో చర్చించనున్నారు. చర్చించనున్నారు. కేంద్ర బడ్జెట్, స్వర్ణాంధ్ర 2047పై అంశాలపై కూడా చర్చిస్తారు. తమకు సంబంధించిన శాఖలకు ప్రజెంటేషన్లు పంపాలని కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం లోగా రెండు ప్రజెంటేషన్లు పంపాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రజెంటేషన్లు ఉండాలని ఆదేశించారు. ప్రజెంటేషన్​ నిడివి 15 నిమిషాలు ఉండాలని సీఎస్​ఆదేశాలు జారీ చేశారు.

Next Story