- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Chandrababu:ఏపీ శకటానికి బహుమతి.. సీఎం చంద్రబాబు హర్షం
ఢిల్లీ(Delhi)లో నిర్వహించిన రిపబ్లిక్ డే(Republic Day) వేడుకల్లో ఏటికొప్పాక బొమ్మలతో కూడిన ఏపీ శకటాన్ని ప్రదర్శించారు.

దిశ,వెబ్‌డెస్క్: ఢిల్లీ(Delhi)లో నిర్వహించిన రిపబ్లిక్ డే(Republic Day)(జనవరి 26) వేడుకల్లో ఏటికొప్పాక బొమ్మలతో కూడిన ఏపీ శకటాన్ని ప్రదర్శించారు. ఏపీకి(Andhra Pradesh) సంబంధించి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఏటికొప్పాక లక్క బొమ్మలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన శకటం ప్రదర్శించడం రాష్ట్రం గర్వించదగిన అంశం అని సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా నేడు(బుధవారం) పరేడ్ శకటాలు ఫలితాలను రక్షణ మంత్రిత్వ శాఖ(Ministry of Defence) ప్రకటించడం జరిగింది. గణతంత్య్ర దినోత్సవ పరేడ్‌లో ప్రదర్శించిన శకటాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడో స్థానంలో నిలించింది. తొలి రెండు స్థానాల్లో ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh), త్రిపుర(Tripura) ఉన్నట్లు పేర్కొన్నారు. ఏపీలోని ఏటికొప్పాక బొమ్మల శకటానికి మూడో స్థానం దక్కింది.
ఈ నేపథ్యంలో ఏపీ శకటానికి బహుమతి లభించడం పై సీఎం చంద్రబాబు(CM Chandrababu) తాజాగా స్పందించారు. రిపబ్లిక్ డే పరేడ్(Republic Day Parade)లో ఏపీ శకటానికి మూడొవ బహుమతిపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఏటికొప్పాక బొమ్మలతో శకటం ఏర్పాటు చేయడం పై సీఎం అభినందనలు తెలిపారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో మన రాష్ట్రానికి 30 ఏళ్ల తర్వాత బహుమతి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇదిలా ఉంటే.. త్రివిధ దళాల్లో జమ్మూకాశ్మీర్ రైఫిల్స్ కవాతు బృందం, కేంద్ర బలగాల విభాగంలో ఢిల్లీ పోలీసు కవాతు(Police parade) బృందం ఉత్తమ మార్చింగ్ కంటింజెంట్‌గా ఎంపికయ్యాయి. కేంద్ర ప్రభుత్వ శాఖ(Department of Central Govt)ల్లో ఉత్తమ శకటంగా గిరిజన శాఖ శకటం ఎంపికైనట్లు రక్షణ శాఖ పేర్కొంది. జయతి జయ మహా భారతం ప్రదర్శించిన కళాకారులతో పాటు కేంద్ర ప్రజా పనుల విభాగ శకటం ప్రత్యేక బహుమతికి ఎంపికైనట్లు తెలుస్తోంది.






