- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం చంద్రబాబు బిజీ బిజీ.. ఆ అంశాలపై నేడు అధికారులతో కీలక భేటీ
రాజధాని అమరావతి (Amaravati) పున:నిర్మాణ పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన తరుణంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధికారులతో వరస సమీక్షలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాజధాని అమరావతి (Amaravati) పున:నిర్మాణ పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన తరుణంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధికారులతో వరస సమీక్షలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ సెక్రటేరియట్‌లో ఆయన ఉదయం 11.30కి రాష్ట్రంలో అమలు అవుతోన్న సంక్షేమ పథకాలపై రివ్యూ నిర్విహించనున్నారు. అదేవిధంగా RGTSపై సమగ్రంగా సమీక్షించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక మధ్యాహ్నం 2:30కి పర్యాటక శాఖ అధికారులతో పలు అంశాలపై చర్చించి సంబంధిత శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) మాట్లాడనున్నారు.
అదేవిధంగా వివిధ శాఖల అధిపతులతో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోన్న అభివృద్ధి పనులపై ఆరా తీయనున్నారు. రాజధాని అమరావతి పరిధిలో చేపట్టబోయే పనులను రాబోయే మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పడంతో ఆ విషయంపై సీఎం ఇప్పటి నుంచే దృష్టి కేంద్రీకరించారు. ఈ మేరకు పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి నారాయణ (Minister Narayana)కు కీలక బాధ్యతలు అప్పగించారు. అమరావతి పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని, త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.






