తాళ్లవలసలో డయేరియా.. సీఎం చంద్రబాబు ఆరా

by Muthe.Rajitha |

ఏపీలోని తాళ్లవలసలో ప్రబలిన డయేరియా పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు.

తాళ్లవలసలో డయేరియా.. సీఎం చంద్రబాబు ఆరా
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని తాళ్లవలసలో ప్రబలిన డయేరియా పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో గత రెండు రోజులుగా 8 మంది డయేరియా కేసులు నమోదు కాగా అందులో ఓ వృద్ధుడు మరణించాడు. దీంతో అక్కడి పరిస్థితిపై సీఎం చంద్రబాబు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. 65 ఏళ్ల మార్పు చిన్నారావు అతిసారం లక్షణాలతోనే మృతి చెందినట్టు గ్రామస్థులు చెబుతుండగా.. ఆ వృద్ధుడి మరణానికి కిడ్నీ సమస్య, మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూరే కారణమని వైద్య అధికారులు అంటున్నారు.

ఇక గ్రామానికి నీటి సరఫరా చేసే బావిని అధికారులు పరీక్షించగా.. అది కలుషితం కాలేదని అన్నారు. అయినప్పటికీ ముందుజాగ్రత్తగా ఆ నీటి సరఫరాను నిలిపివేసి, ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తున్నారు. పంచాయతీ అధికారులు, డీఎంహెచ్‌వో, ఎపిడెమియాలజిస్టు గ్రామంలోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Next Story