- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈనెల 27న ఎన్నికలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలపై మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో ఈ నెల 27న రెండు గ్రాడ్యుయేట్(Graduate), ఒక ఉపాధ్యాయ(Teacher) ఎమ్మెల్సీ ఎన్నికలు(MLC elections) జరగనున్నాయి. దీంతో అభ్యర్థులు నామినేషన్ల దరఖాస్తు చేస్తున్నారు. నేటితో దరఖాస్తుల స్వీకరణ ముగియనుంది. ఈ మేరకు అన్ని పార్టీల నాయకులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రేపటి వరకూ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 13 వరకూ ఉపసంహరణ ఉంటుంది. అయితే ఎలాగైనా సరే ఎమ్మెల్సీగా గెలవాలని పట్టుదలతో పని చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
మరోవైపు కూటమి ప్రభుత్వం(Kutami Government) సైతం ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది. మూడు ఎమ్మెల్సీలను గెలుచుకోవాలని వ్యూహాలు అమలు చేస్తోంది. ఈ ఎన్నికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) సైతం ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా మంత్రులు(Ministers), ఎమ్మెల్యేల(Mla)తో భేటీ నిర్వహించారు. ఎన్నికల్లో గెలుపుపై వారికి దిశా నిర్దేశం చేశారు. గ్రాడ్యుయేట్లకు ప్రభుత్వ పథకాలను వివరించాలని ఆదేశించారు. కూటమి నేతలంతా సమన్వయంతో పని చేయాలని నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు.






