- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తుపాన్ దాగుడుమూతలు ఆడింది: సీఎం చంద్రబాబు
మొంథా తుపాన్(Cyclone Montha) ప్రభావంతో ఏపీలోని అనేక ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: మొంథా తుపాన్(Cyclone Montha) ప్రభావంతో ఏపీలోని అనేక ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. అనేకచోట్ల పంటనష్టంతో పాటు వేలాది కుటుంబాలు నిరాశ్రయులు అయ్యారు. తుపాన్ ప్రభావ పరిస్థితి, పంట, ఆస్తి నష్టంపై అధికారులతో సీఎం చంద్రబాబు(CM Chandrababu) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో హుద్‌హుద్ తుపాన్‌తో విశాఖపట్నం అతలాకుతలం అయ్యింది.. వారం రోజుల్లోనే ఆనాడు పరిస్థితులను చక్కదిద్దాం.. తరువాత వచ్చిన తిత్లీ తుపాన్ సమయంలోనూ సమర్థంగా పనిచేశాం.. బడమేరు వరదను ఎదుర్కొన్నాం.. టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తున్నాం.. శాటిలైట్ ఇమేజ్‌ల ఆధారంగా తుపాన్ పరిస్థితులను అంచనా వేశాం.. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ సచివాలయం వరకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం.. బాధితులు అందరినీ ఆదుకుంటాం.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తుపాన్ కారణంగా జరిగిన పంటనష్టంపై ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు ఆయన తెలిపారు. వరి, మొక్కజొన్న, పత్తి. అరటి, ఇతర ఉద్యాన వన పంటలు బాగా దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేసి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సమగ్ర నివేదిక తయారు చేయాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
‘‘ఈ తుఫాన్ దాగుడుమూతలు ఆడింది. కాకినాడలో తీరం దాటుతుందని అంతా చెప్పారు. అంతర్వేది దగ్గర తీరం దాటి తెలంగాణలో ఎక్కువగా వర్షం కురిసింది. అనుకున్న చోట కాకుండా వేరే ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. రిజర్వాయర్లలో ఎంత వాటర్ ఉందో గుర్తించి ముందుగానే ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి’’ అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.






