గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by velandi.Saikiran |   (  Updated:2025-07-14 10:17:58  IST  )

అశోక్ గజపతి రాజుకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. గోవా గవర్నర్‌గా నియమితులైన అశోక్ గజపతి రాజుకు

గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అశోక్ గజపతి రాజుకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. గోవా గవర్నర్‌గా నియమితులైన అశోక్ గజపతి రాజుకు హృదయపూర్వక అభినందనలు అని ట్వీట్ చేశారు సీఎం చంద్రబాబు. ఇది మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణమైన క్షణం అన్నారు. ఈ గౌరవాన్ని ఆయనకు అందించినందుకు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రివర్గానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు సీఎం చంద్రబాబు.

ఇది ఇలా ఉండగా... తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టిడిపి సీనియర్ నాయకులు, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి అప్పగిస్తున్న నిర్ణయం తీసుకుంది కేంద్ర సర్కార్. అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్ గా నియామకం చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక ప్రకటన చేశారు. అటు హర్యానా రాష్ట్ర గవర్నర్ గా ఆషిమ్ కుమార్‌ ఘోష్‌, లడాఖ్ లెఫ్ట్నెంట్ గవర్నర్ గా కవీందర్ గుప్తాను నియామకం చేశారు. ఈ మేరకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు.

Next Story