- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు మరో నూతన ఒరవడికి శ్రీకారం
ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) రాష్ట్రంలో అభివృద్ధే(State Development) లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) రాష్ట్రంలో అభివృద్ధే(State Development) లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల సీఎం చంద్రబాబు దావోస్(Dawos) పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రంలో పలు కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో అత్యాధునిక సాంకేతికత వినియోగంలో ఎల్లప్పుడూ ముందుండే సీఎం చంద్రబాబు తాజాగా మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. తొలిసారి కెమెరామెన్లు(Cameramen), వీడియో గ్రాఫర్లు(videographers) లేకుండానే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఏఐ సిస్టమ్‌తో శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. కృత్రిమ మేధ సాయంతో ప్రెస్ మీట్‌ను లైవ్ కవరేజీ అందించారు. దీనికోసం ఉండవల్లి లోని నివాసంలో ఏఐ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
సీఎం క్యాంపు కార్యాలయం(CM Camp Office) కావడంతో ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) అంగీకరించలేదు. సొంత నిధులు వెచ్చించి లోకేష్ స్వయంగా ఈ ఏర్పాట్లు చేయించారు. సమావేశ మందిరంలో నాలుగు కెమెరాలతో మల్టీ వీడియో కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ తరుణంలో సీఎం చంద్రబాబు ఇందులోని ఓ కెమెరాకు సూచనలు ఇవ్వడంతో లైవ్ ప్రారంభమైంది. చంద్రబాబు దావోస్ పర్యటన విశేషాలు చెబుతుండగా.. సీఎంను కేంద్రంగా చేసుకుని, ఆయన సెంటర్ ఫ్రేమ్‌లో ఉండేలా సర్దుబాట్లు చేసుకుంటూ AI వ్యవస్థ వీడియో ఔట్‌పుట్ ఇచ్చింది. అయితే ప్రెస్ మీట్ లైవ్(Press meet Live) కవరేజీకి దాదాపు 8 మంది కెమెరామన్లు, సిబ్బంది అవసరం అవుతుంది. కానీ AI వ్యవస్థ ద్వారా ఒక్కరితోనే పూర్తయింది.






