పొదుపు సంఘాలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

by Ajay Maddhiboyina |

పొదుపు సంఘాలకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. అన్ లైన్ లోనే పొదుపు సంఘాలు రుణాలు తీసుకునేలా సదుపాయం కల్పిస్తామని అన్నారు.

పొదుపు సంఘాలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
X

దిశ‌, వెబ్ డెస్క్: పొదుపు సంఘాలకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. అన్ లైన్ లోనే పొదుపు సంఘాలు రుణాలు తీసుకునేలా సదుపాయం కల్పిస్తామని అన్నారు. గుంటూరు నగర శివారులో ఏర్పాటు చేసిన సరస్ మేళాలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొదుపు సంఘాలు రూ.26వేల కోట్ల నిధిని ఏర్పాటు చేశాయని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 1.13 కోట్ల మంది సభ్యులు సంఘాల్లో ఉన్నారని చె ప్పారు. రూ.5,200 కోట్ల కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.

పొదుపు సంఘాల్లో చేరాలని చెప్పిన తన మాట విన్న కుటుంబాలు ఇప్పుబు బాగుపడ్డాయని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా సంఘాల ద్వారా ఎక్కువ తలసరి ఆదాయం పొందుతున్నది తెలుగు వారి కుటుబాలేనని చెప్పారు. మహిళల శక్తి తనకు తెలుసునని మన రాష్ట్రంలోని మహిళలు ఉత్తర భారతదేశంలోని మహిళలకు శిక్షణ ఇచ్చారని అన్నారు. మహిళా సంఘాలను సమర్ధవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అని చెప్పారు. మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించామని అన్నారు.

Next Story