రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-02 11:07:35  IST  )

రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ తెలిపారు..

రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: కుప్పం రైతులు, ప్రజల(Kuppam Farmers, People)కు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) గుడ్ న్యూస్ తెలిపారు. ఈ ఏడాదిలోనే సాగు నీళ్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. కుప్పం నియోజకవర్గం తుమ్మిసిలో నిర్వహించిన సుపరిపాలనలో ‘తొలి అడుగు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వర్ణ కుప్పంలో భాగంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుప్పాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. ఐదేళ్ల జగన్(Jagan) పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందన్నారు. సంవత్సర కాలంలో సుపరిపాలన అందించే దిశగా ప్రయత్నం చేశామని చెప్పారు. రూ.1617 కోట్లతో కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయన్నారు. హంద్రీనీవా ద్వారా శ్రీశైలం(Srisailam) నుంచి కుప్పానికి సాగునీళ్ల అందిస్తామని హామీ ఇచ్చారు. కుప్పంలో ఎయిర్ పోర్టు నిర్మిస్తామని, రైల్వే స్టేషన్‌ను ఆధునీకరిస్తామని తెలిపార. అంతేకాదు ఎలక్ట్రిక్ ఆటోలు, బస్సు నడిచేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు. కుప్పం పట్టణ రూపురేఖలు మార్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చంద్రబాబు వ్యా్ఖ్యానించారు.

Next Story