- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడ్ న్యూస్.. ఇవాళ వారి ఖాతాలలో డబ్బులు..1.29 లక్షల కుటుంబాలకు లబ్ధి
ఏపీ లోని మత్స్యకారులకు ( fishermen) గుడ్ న్యూస్ చెప్పింది చంద్రబాబు నాయుడు ( Cm Chandrababu aidu) ప్రభుత్వం.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లోని మత్స్యకారులకు ( fishermen) గుడ్ న్యూస్ చెప్పింది చంద్రబాబు నాయుడు ( Cm Chandrababu aidu) ప్రభుత్వం. మత్స్యకారులు అందరికీ ఆర్థిక సహాయాన్ని పెంచి మరి అందించబోతోంది. వేట నిషేధం ఉన్న నేపథ్యంలో జాలర్లకు... ఆర్థిక సాయాన్ని పెంచిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం... ఆ నిధులను ఇవ్వాళ రిలీజ్ చేయనుంది. మత్స్యకార సేవ లో పేరుతో జాలర్లకు 20,000 చొప్పున ఆర్థిక సహాయం చేయబోతోంది.
ఈ పథకం కింద 1.29 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరాలని ఉంది. ఈ పథకం కోసం 258 కోట్ల మేర ఖర్చు చేయబోతోంది చంద్రబాబు నాయుడు సర్కార్. ఇవాళ మధ్యాహ్నం పూట మత్స్యకారులకు ఈ నిధులను విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు ( Cm Chandrababu aidu). ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ( Srikakulam District) పర్యటించబోతున్న చంద్రబాబు నాయుడు.... ఈ సందర్భంగా ఆ నిధులను రిలీజ్ చేస్తారు.
ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 16 వ తేదీ వరకు అంటే 61 రోజుల పాటు చేపల వేట పై నిషేధం విధించింది చంద్రబాబు నాయుడు సర్కార్. దీంతో.. ఆ సమయంలో జాలర్లు అందరూ ఉపాధి కోల్పోనున్నారు. అయితే వారందరికీ ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఈ పథకాన్ని తీసుకు వచ్చింది సర్కార్. గతంలో కూడా ఈ పథకం కొనసాగిగా ఇప్పుడు ఆర్థిక సహాయాన్ని పెంచి అమలు చేస్తోంది.






