సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే... ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పరిశీలన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-12 12:22:51  IST  )

ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు..

సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే... ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పరిశీలన
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాంధ్ర(Uttarandra) ప్రాజెక్టుల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు(Cm Chandrababu) దృష్టి పెట్టారు. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు ఏరియల్ సర్వే(Arial Surve) చేపట్టారు. ప్రాజెక్టుల పురోగతిని హెలికాప్టర్(Helicopter) ద్వారా స్వయంగా పరిశీలించారు. ఎయిర్ పోర్టులు, పోర్టుల నిర్మాణాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. వివిధ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ఐటీ కంపెనీలను హెలికాప్టర్ ద్వారా పరిశీలన చేశారు. అనంతరం విశాఖ(Visakha) ఎకనమిక్ రీజియన్‌లో అధికారులతో భేటీ అయ్యారు. ప్రాజెక్టుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు(Bhogapuram Air Port) నిర్మాణ పనులపై ఆరా తీశారు. అలాగే రాయ్‌పూర్-విశాఖ జాతీయ రహదారిపైనా చర్చించారు. తీర ప్రాంత రోడ్లు, కనెక్టివిటీ ప్రాజెక్టులపై అధికారులను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

Next Story