- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యోగాంధ్రపై జగన్ విమర్శలు.. సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
విశాఖలో ఈ రోజు నిర్వహించిన యోగాంధ్ర విజయవంతం అయింది..

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Viaskha)లో ఈ రోజు నిర్వహించిన యోగాంధ్ర(Yogandra) విజయవంతం అయింది. గిన్నిస్ బుక్ రికార్డు(Ginnis Book Record) సైతం సాధించింది. అయితే ఈ కార్యక్రమంపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) విమర్శలు కురిపించారు. యోగాంధ్ర పేరుతో నిధులు వృదా చేశారని విమర్శించారు. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగాంధ్రకు ప్రజాధనం వృథా అంటూ జగన్ చేసిన విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రుషికొండ ప్యాలెస్‌కు రూ. 100 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్లు కూడా యోగాంధ్రపై విమర్శలు చేస్తారా అంటూ సెటైర్లు వేశారు. ఇలాంటి సమయంలో కొందరి గురించి మాట్లాడటం వేస్ట్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాంటి భూతాలను నియంత్రించే విషయంలో ప్రజలను చైతన్యం చేస్తామని చెప్పారు. యోగాంధ్రకు కేంద్రమే రూ. 75 కోట్లు ఖర్చు చేసిందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.






