ఎల్లుండి నుంచి స్కూళ్లలో ముస్తాబు : సీఎం చంద్రబాబు

by Muthe.Rajitha |

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఎల్లుండి నుంచి స్కూళ్లలో ముస్తాబు : సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే అమలవుతున్న "ముస్తాబు" ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ స్కూళ్లల్లో ఈ కార్యక్రమాన్ని ఎల్లుండి నుంచే ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి తరగతి గదులను, పాఠశాల పరిసరాలను శుభ్రం చేస్తారన్నారు. అలాగే మొక్కలు పెంచడం,, వాటిని రక్షించడం వంటి కార్యక్రమాలపై అవగాహనా కల్పిస్తారని అన్నారు.

కాగా గురువారం జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు స్వఛ్చాంధ్రలో భాగంగా రాష్ట్రంలో మరిన్ని ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అలాగే విద్యుత్ ఖర్చు యూనిట్ పై మరింత తగ్గగేందుకు చర్యలు చేపడతామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story