సొంతూరిలో సంక్రాంతి సంబురాలు.. పాల్గొన్న సీఎం చంద్రబాబు కుటుంబం

by Ajay Maddhiboyina |

సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో చంద్రబాబు కుటుంబంతో సహా కలిసి పాల్గొన్నారు.

సొంతూరిలో సంక్రాంతి సంబురాలు.. పాల్గొన్న సీఎం చంద్రబాబు కుటుంబం
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో చంద్రబాబు కుటుంబంతో సహా కలిసి పాల్గొన్నారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మిణి, బాలకృష్ణ స‌తీమ‌ణి వ‌సుంధ‌ర‌, తేజ‌స్విని, భ‌ర‌త్ మ‌రియు లోకేష్ త‌న‌యుడు దేవాంశ్ ఉన్నారు. సంబ‌రాల్లో భాగంగా క్రీడ‌ల‌తో పాటు ముగ్గుల పోటీలు నిర్వ‌హించారు. భువ‌నేశ్వ‌రి, బ్రాహ్మిణి ముగ్గుల పోటీల‌ను ద‌గ్గ‌రుండి ప‌రిశీలించారు. అంతేకాకుండా లోకేష్ త‌న‌యుడు దేవాంశ్ వివిధ క్రీడ‌ల్లో గ్రామ‌స్తుల‌తో క‌లిసి పాల్గొన్నాడు. పోటీల అనంత‌రం చంద్ర‌బాబు ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి క‌లిసి విజేత‌ల‌కు బ‌హుమ‌తుల‌ను అంద‌జేశారు. గ్రామాన్ని సందర్శించిన చంద్ర‌బాబు ప్ర‌జ‌లు ఇచ్చిన విన‌తీప‌త్రాల‌ను సైతం స్వీక‌రించి ప‌రిశీలించారు. గ్రామంలో అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న చేశారు.

Next Story