నా మనసు అతలాకుతలం అవుతోంది: సీఎం చంద్రబాబు ఎమోషనల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-29 15:58:28  IST  )

నా మనసు అతలాకుతలం అవుతోందని సోషల్ మీడియాపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు..

నా మనసు అతలాకుతలం అవుతోంది:  సీఎం చంద్రబాబు ఎమోషనల్
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా చాలా ప్రమాదకరమని సీఎం చంద్రబాబు అన్నారు. ఒక్కోసారి సోషల్ మీడియాను చూస్తే తన మనసు అతలాకుతలం అవుతోందని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలను అవమానించే విధంగా పోస్టులు ఉంటున్నాయని, గౌరవంగా బతికేవాళ్లను ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తున్నాయన్నారు. సోషల్ మీడియాను కట్టడి చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పారు. జగన్ కరడు గట్టిన వ్యక్తి రాజకీయ నేరస్తుడని మండిపడ్డారు. సత్తెనపల్లిలో హిట్ అండ్ రన్ చేసి వెళ్లిపోయారన్నారు. కారు చక్రాల కింద మనిషి పడిపోతే కనీసం పట్టించుకోలేదని తెలిపారు. సామాజిక బాధ్యత లేకుండా వ్యవహరించారని చెప్పారు. గత పాలకులు విధ్వంసంతో రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశారని, ఏపీ కంటే తెలంగాణకు ఆదాయం ఎక్కువని, సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రీ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story