- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి ఘటనకు కులం, మతం రంగు పులుముతున్నారు: సీఎం చంద్రబాబు
వైసీపీ కుల రాజకీయాలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కుట్రలు పన్నే పార్టీలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ప్రతి అంశాన్ని రాజకీయాలకు ముడిపెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ కృష్ణలంక(Vijayawada Krishnalanka)కు చెందిన సాయికృష్ణ మిస్సింగ్(Saikrishna Missing) వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై సిట్ అధికారులు విచారణ చేపడుతున్నారు. మరోవైపు ఈ వ్యవహార్నాన్ని వైసీపీ నేతలు(Ycp) కులానికి పులిమారు. కాపు రాజకీయంగా మార్చేశారు. కోనసీమ జిల్లాలో వైసీపీ కాపు నేతలు సమావేశం నిర్వహించి సాయికృష్ణ మిస్సింగ్ ఘటనపై ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. కాపు యువకుడు సాయికృష్ణ మిస్సింగ్ ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు.
కుల, మత రాజకీయాలపై సీఎం ఫైర్
దీంతో కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. వైసీపీ కుల రాజకీయాన్ని ఆ పార్టీ నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. మరోవైపు ఈ పరిణామాలతో సీఎం చంద్రబాబు(Cm Chandrababu) ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ కుల రాజకీయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కుట్రలు పన్నే పార్టీలు ఉన్నాయని మండిపడ్డారు. ప్రతి అంశాన్ని రాజకీయాలకు ముడిపెడుతున్నారని ఆరోపించారు. వివాదలకు కులం, మతం రంగు పులుముతున్నారని వ్యాఖ్యాణించారు. విద్వేషాలు రెచ్చగొట్టే ఘటనపై కూటమి నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తప్పుడు ప్రచారాలను సమర్థంగా నియంత్రించాలని చెప్పారు. డిసెంబర్‌లో క్వాంటం కంప్యూటర్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఏపీకి బలమైన మానవ వనరుల వ్యవస్థ అవసరమన్నారు. మంత్రులు, అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని అధికారులకు తెలిపారు.






