లోకేశ్ సీఎం వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం... మంత్రి టీజీ భరత్‌కు క్లాస్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-20 16:47:10  IST  )

కాబోయే సీఎం లోకేశ్ అని మంత్రి భరత్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు..

లోకేశ్ సీఎం వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం... మంత్రి టీజీ భరత్‌కు క్లాస్
X

దిశ, వెబ్ డెస్క్: కాబోయే సీఎం నారా లోకేశ్(Nara Lokesh) అంటూ దావోస్‌లో మంత్రి టీజీ భరత్(Minister TG Bharath) చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. అసందర్భ ప్రసంగాలు ఎందుకంటూ ఫైర్ అయ్యారు. ఎక్కడ ఏం మాట్లాడుతున్నావ్ అంటూ మండిపడ్డారు. వ్యక్తిగత అభిప్రాయాలు బహిరంగ ప్రదేశాల్లో చెప్పొద్దని క్లాస్ తీసుకున్నారు. ఇలాంటి కామెంట్స్ మరోసారి చేయవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు.

మంత్రి భరత్ చేసిన వ్యాఖ్యలివే...


ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కాబోయే సీఎం నారా లోకేశ్(Nara Lokesh) అని మంత్రి టీజీ భరత్(Minister Tg Bharat) స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం లోకేశ్ అని ప్రచారం జరుగుతున్న వేళ దావోస్ వేదికగా మంత్రి భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ బాగా చదువుకున్నారని, డైనమిక్ లీడర్ అని వ్యాఖ్యానించారు. చాలా దశాబ్దాల పాటు లోకేశ్‌దే భవిష్యత్ అని చెప్పారు.175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు, రాజ్యసభ ఎంపీల్లో ఎవరూ కూడా స్టాన్ ఫోర్డ్ వర్సిటీలో చదివినోళ్లు లేరని తెలిపారు. పదవుల విషయంలో ఏం చేయాలో.. ఏం చేయకూడదో మంత్రి లోకేశ్‌కు చాలా బాగా తెలుసని, రాజకీయాలపై పూర్తి అవగాహన ఉందని తెలిపారు. తమకు, తమ పార్టీకి సుదర్ఘమైన విజన్ ఉందని, చంద్రబాబు చేతుల్లో రాష్ట్ర భవిష్యత్ సురక్షితంగా ఉందన్నారు. సీనియర్లు, జూనియర్లతో మంత్రివర్గం చాలా పటిష్టంగా ఉందని మంత్రి టీజీ భరత్ చెప్పారు.

Next Story