- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Chandrababu:పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారమే ప్రతి నెల పింఛన్లు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు.

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారమే ప్రతి నెల పింఛన్లు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. నేమకల్లు ఇందిరమ్మ కాలనీలో పలువురు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో కలియతిరుగుతూ ప్రజలను పలకరించారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కాసేపట్లో స్థానికులతో సమావేశమై ఆర్జిలను స్వీకరించనున్నారు.
Next Story






