Vijayawada: తమన్‌ మ్యూజికల్‌ నైట్‌లో CM చంద్రబాబు, DCM పవన్ కల్యాణ్

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-01 09:29:11  IST  )

ఎన్టీఆర్ ట్రస్ట్(NTR Trust) ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల సహాయార్థం విజయవాడలో సంగీత దర్శకుడు తమన్‌(Music Director Thaman) మ్యూజికల్‌ నైట్(Musical Night) ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు.

Vijayawada: తమన్‌ మ్యూజికల్‌ నైట్‌లో CM చంద్రబాబు, DCM పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ ట్రస్ట్(NTR Trust) ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల సహాయార్థం విజయవాడలో సంగీత దర్శకుడు తమన్‌(Music Director Thaman) మ్యూజికల్‌ నైట్(Musical Night) ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan), మంత్రి నారా లోకేష్(Nara Lokesh), సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)తో పాటు మరికొంత మంది టాలీవుడ్ నటులు, వేలాది మంది ప్రేక్షకులు హాజరయ్యారు. తలసేమియా వ్యాధిపై ప్రజలకు, బాధితులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నారు. తలసేమియా బాధితుల కోసం నారా భువనేశ్వరి చేపట్టిన మ్యూజిక్ నైట్‍పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. దీని ద్వారా వచ్చే నగదును తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం భువనేశ్వరి వినియోగించనున్నారు.

ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్ చేపట్టిన ధర్మ పరిరక్షణ యాత్ర ఇవాళే పూర్తయ్యింది. మూడు రోజుల పాటు కేరళ, తమిళనాడుల్లో జరిగిన ఈ యాత్రలో పవన్‌తో పాటు ఆయన తనయుడు అకీరా నందన్‌(Akira Nandan), ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి(Art Director Anand Sai) పాల్గొన్నారు. ఇవాళ మధ్యాహ్నమే రాష్ట్రానికి వచ్చిన పవన్ కల్యా్ణ్.. మంగళగిరి వెళ్లి.. అక్కడి నుంచి నేరుగా మ్యూజికల్ నైట్‌కు వచ్చారు.

Video Link

Next Story