CM Chandrababu Naidu : పద్మశ్రీ అందుకున్న మందకృష్ణ మాదిగ.. సీఎం చంద్రబాబు అభినందనలు

by Muthe.Rajitha |

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS) వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) ఈ రోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌(Rashtrapati Bhavan)లో జరిగిన పద్మ అవార్డుల(Padma Awards) రెండవ విడత ప్రదానోత్సవంలో పద్మశ్రీ(PadmaSri) అవార్డును అందుకున్నారు.

CM Chandrababu Naidu : పద్మశ్రీ అందుకున్న మందకృష్ణ మాదిగ.. సీఎం చంద్రబాబు అభినందనలు
X

దిశ, వెబ్ డెస్క్ : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS) వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) ఈ రోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌(Rashtrapati Bhavan)లో జరిగిన పద్మ అవార్డుల(Padma Awards) రెండవ విడత ప్రదానోత్సవంలో పద్మశ్రీ(PadmaSri) అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) చేతుల మీదుగా స్వీకరించారు. 30 ఏళ్లకు పైగా దళితుల హక్కుల కోసం, ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గం ఉద్యమానికి చేసిన కృషికి ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) మందకృష్ణ మాదిగకు అభినందనలు తెలిపారు.

తన X ఖాతా వేదికగా పోస్ట్‌లో, "మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు, నా ఆత్మీయుడు మంద కృష్ణ మాదిగ నేడు రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో పద్మశ్రీ పురస్కారం అందుకోవడం ఆనందం కలిగించింది. ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను" అని చంద్రబాబు పేర్కొన్నారు. 2025 పద్మ అవార్డుల్లో మొత్తం 139 మందికి అవార్డులు ఇవ్వగా, జనవరి 25న ప్రకటించిన ఈ అవార్డులలో 7 మందికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.

Next Story