కోనేరు హంపిపై సీఎం ప్రశంసల వర్షం.. హర్షం వ్యక్తం చేసిన శాప్ ఛైర్మన్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-25 05:33:54  IST  )

ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ ఫైనల్ (Fide Women's Chess World Cup) కు చేరుకున్న భారత్ చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి (Koneru Hampi)కి సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అభినందనలు తెలిపారు.

కోనేరు హంపిపై సీఎం ప్రశంసల వర్షం.. హర్షం వ్యక్తం చేసిన శాప్ ఛైర్మన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ ఫైనల్ (Fide Women's Chess World Cup) కు చేరుకున్న భారత్ చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి (Koneru Hampi)కి సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. హంపి దృఢ సంకల్పం, ప్రతిభ ప్రశంసనీయం, స్ఫూర్తిదాయకమన్నారు. శాప్ ఛైర్మన్ రవినాయుడు కూడా హంపి ఫైన్ల్ కు చేరుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. వరల్డ్ కప్ ఫైనల్ లో అడుగుపెట్టిన తొలి భారతీయురాలిగా ఆమె ఘనతను సాధించారన్నారు. ఫిడే వరల్డ్ కప్ ఫైనల్ లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Next Story