- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీడీపీ నేత మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం
తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ (TDP) సీనియర్ నేత.. సికింద్రాబాద్ పార్లమెంట్ మాజీ అధ్యక్షులు పిన్నమనేని సాయిబాబా (Pinnamaneni Saibaba) మరణించారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ (TDP) సీనియర్ నేత.. సికింద్రాబాద్ పార్లమెంట్ మాజీ అధ్యక్షులు పిన్నమనేని సాయిబాబా (Pinnamaneni Saibaba) మరణించారు. ఆయన మరణం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. సాయిబాబా కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటుగా పేర్కొంటూ సంతాపం తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో బాధను ప్రజలతో పంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంట్ మాజీ అధ్యక్షులు, దివ్యాంగుల సంస్థ మాజీ చైర్మన్, ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా మరణం విచారకరం. దశాబ్దాల తరబడి సాయిబాబా పార్టీకి అంకితభావంతో చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన మృతి పార్టీకి, వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. ఎప్పుడు పార్టీ కార్యాలయానికి వెళ్లినా ముందుగా ఎదురొచ్చి స్వాగతం పలికే సాయిబాబా దూరం కావడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ... సాయిబాబా కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను. అని సీఎం చంద్రబాబు నాయుడు పోస్ట్ చేశారు.






