- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాన్వాయ్డ్రైవర్ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం
by Thanuru Gopichand |
ముఖ్యమంత్రి వాహనశ్రేణిలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎండీ అమీన్ బాబు గుండెపోటుతో మరణించారు.

X
దిశ, డైనమిక్‌బ్యూరో : ముఖ్యమంత్రి వాహనశ్రేణిలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎండీ అమీన్ బాబు గుండెపోటుతో మరణించారు. అమీన్ బాబు మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. సీఎం కాన్వాయ్‌లోని వాహనశ్రేణిలో డ్రైవర్‌గా సుదీర్ఘకాలంగా అమీన్‌బాబు విధులు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున అమీన్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రభుత్వ పరంగా అమీన్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.
Next Story






