సూపర్ సిక్స్‌ని సూపర్ హిట్ చేశాం: చంద్రబాబు

by Ajay Maddhiboyina |

సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తమ ప్రభుత్వంలో సంక్షేమానికే పెద్దపీట‌ వేస్తామన్నారు. కాకినాడ‌లో రూ.18వేల కోట్ల‌తో ఏర్పాటు చేయ‌నున్న ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ శంకుస్థాప‌న చేశారు.

సూపర్ సిక్స్‌ని సూపర్ హిట్ చేశాం: చంద్రబాబు
X

దిశ‌, వెబ్ డెస్క్: సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తమ ప్రభుత్వంలో సంక్షేమానికే పెద్దపీట‌ వేస్తామన్నారు. కాకినాడ‌లో రూ.18వేల కోట్ల‌తో ఏర్పాటు చేయ‌నున్న ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. గ‌తంలో ఇచ్చిన సంక్షేమం కంటే మెరుగైన సంక్షేమం అందిస్తామ‌ని చెప్పి తాము స‌క్సెస్ అయ్యామ‌ని అన్నారు. హామీ ఇచ్చినట్టుగానే అభివృద్ధిని ప‌రిగెత్తిస్తున్నామ‌ని వ్యాఖ్యానించారు. దేశంలో బ్యాంక్ ఆఫ్ బ‌రోడా చేసిన స‌ర్వేలో దేశంలో 25శాతం పెట్టుబ‌డులు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కే వ‌చ్చాయ‌ని అన్నారు.

మొన్న విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన స‌మ్మిట్ లో ఏకంగా రూ.13 ల‌క్ష‌ల 25వేల కోట్ల పెట్టుబడులు వ‌చ్చాయ‌ని చెప్పారు. దీంతో రాష్ట్రంలో 16ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు వ‌స్తాయ‌ని వ్యాఖ్యానించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను గ్రీన్ హైడ్రోజ‌న్ వ్యాలీగా త‌యారు చేస్తామ‌ని చెప్పారు. గ్రీన్ అమ్మోనియా భ‌విష్య‌త్ లో పెను మార్పుకు నాంది ప‌లుకుతుంద‌ని చెప్పారు. గ్రీన్ ఎన‌ర్జీ ఉత్ప‌త్తి పెంచాల‌ని ప్ర‌ధాని మోడీ భావిస్తున్నార‌న్నారు. 2014లోనే ఏపీలో గ్రీన్ ఎనర్జీ ప్రారంభించామ‌ని ఇప్పుడు గ్రీన్ హైడ్రోజ‌న్, గ్రీన్ అమ్మెనియాకు నాంది ప‌లికామ‌న్నారు. బొగ్గు వినియోగం వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ తింటుంద‌ని కాలుష్యం వల్ల స‌ముద్రంలోనూ పెను మార్పులు వ‌స్తున్నాయ‌న్నారు. ఏపీకి వెయ్యి కిమీ స‌ముద్ర తీరం ఉంద‌ని, 20 పోర్టులు ఏర్పాటు కానున్నాయ‌ని చెప్పారు.

Next Story