- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎక్కువ తింటే నష్టమే.. ఆరోగ్యంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఎక్కువ తిండి తినడం వల్ల లాభం లేదని, నష్టమే కలుగుతుందని సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.

దిశ, వెబ్ డెస్క్: ఎక్కువ తిండి తినడం వల్ల లాభం లేదని, నష్టమే కలుగుతుందని సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మనిషి జన్మ 120, 130 సంవత్సరాలు ఉంటుందని అన్నారు. కానీ 120 సంవత్సరాల్లో తినాల్సిన తిండి 30 ఏళ్లలోనే తింటున్నారని చెప్పారు. దానివల్ల అజీర్తి, షుగర్ లాంటి సమస్యలు వస్తున్నాయని అన్నారు. కాబట్టి మితంగా తినడం అలవాటు చేసుకోవాలని అన్నారు. తీనే ఆహారంలో పౌష్టికాహారం ఉండేలా చూసుకోవాలని చెప్పారు. అంతేకాకుండా కుప్పంలో కాలుష్యం ఉండదని అన్నారు. పొల్యూషన్ లేకుండా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బయట వాళ్లు ఎవరైనా ఎక్కువ రోజులు బతకాలి అనుకుంటే నేరుగా వచ్చి కుప్పంలో స్థిరపడే పరిస్థితి వస్తుందని అన్నారు. అలాంటి ప్రాంతంగా కుప్పంను తయారు చేస్తామని అన్నారు.






