రైతు ఆదాయం పెరగాలంటే ఖర్చులు తగ్గాలి: చంద్రబాబు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-11-07 14:01:34  IST  )

రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేసేలా ప్ర‌భుత్వం పనిచేస్తుంద‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. కూట‌మి ప్ర‌భుత్వంలో వ్య‌వ‌సాయానికి పెద్ద‌పీట వేశామ‌ని చెప్పారు.

రైతు ఆదాయం పెరగాలంటే ఖర్చులు తగ్గాలి: చంద్రబాబు
X

దిశ‌, వెబ్ డెస్క్: రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేసేలా ప్ర‌భుత్వం పనిచేస్తుంద‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. కూట‌మి ప్ర‌భుత్వంలో వ్య‌వ‌సాయానికి పెద్ద‌పీట వేశామ‌ని చెప్పారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా రైతు సంక్షేమం కోసం ప‌నిచేస్తుంద‌ని చెప్పారు. రైతుకు ఆదాయం పెర‌గాలంటే ఖ‌ర్చులు త‌గ్గాల‌ని వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలో ఉంటే త‌ల‌స‌రి ఆదాయం,అగ్రిక‌ల్చ‌ర్ జీఎస్టీ కాంట్రిబ్యూష‌న్ కూడా ఎక్కువ‌గా ఉంటుంద‌ని తెలిపారు.

ఈ ఏడాది వ్య‌వ‌సాయ‌రంగం జీఎస్టీపీలో15.5శాతం పెరిగింద‌ని చెప్పారు. ఎక్క‌డిక్క‌డ జీఎస్టీపీ పెరిగిన‌ప్పుడు రైతుల‌కు కూడా ఆదాయం పెరుగుతుంద‌ని అన్నారు. ఎన్జీ రంగా ఒక రచయిత, శాస్త్రవేత్త, తత్త్వవేత అని కొనియాడారు. తాను సీఎం అయిన మొదట్లో హైదరాబాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఎన్జీ రంగా పేరు పెట్టానని చెప్పారు. జీవితకాలంలో 50 ఏళ్లు పార్లమెంట్ మెంబర్‌గా ఉన్న ఏకైక వ్యక్తి ఎన్జీ రంగా అని అన్నారు. ఎన్జీ రంగా ఎప్పుడూ పదవుల మీద ఆశ పడలేదని చెప్పారు.

Next Story