- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Chandrababu: ఉగ్రదాడిలో ఆంధ్రావాసుల దుర్మరణం.. సీఎం చంద్రబాబు సంతాపం
పహల్గాం (Pahalgam)లో ఉగ్రదాడిలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం (Pahalgam)లో ఉగ్రదాడిలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒకరు విశాఖపట్నం (Vishakhapatnam)కు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ చంద్రమౌళి కాగా.. మరొకరు నెల్లూరు జిల్లా కావలికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మధుసూదన్ ఉన్నారు. ఈ మేరకు ఇవాళ వారి మృతి పట్ల సీఎం చంద్రబాబు (CM Chandrababu) సంతాపం వ్యక్తం చేశారు. అదేవిధంగా మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం ఆయన చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ నష్టాన్ని భరించే శక్తి బాధిత కుటుంబాలకు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఉగ్రవాద చర్యలు సమాజంపై ఒక మాయని మచ్చ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, పహల్గాం (Pahalgam) ఉగ్రదాడిలో విశాఖపట్నం (Vishakhapatnam)కు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి (Chandramouli) దుర్మరణం పాలయ్యారు. ఉగ్రవాదులకు చంద్రమౌళి ఎదురుపడగా.. పారిపోతున్న క్రమంలో వెటాడి.. వెంటాడి మరి ఉగ్రవాదులు అతడిని కాల్పి చంపారు. చంపొద్దని వేడుకున్నా.. ‘ఏదైనా ఉంటే వెళ్లి మీ ప్రధాని మోడీకి చెప్పుకోండి’ అంటూ చంద్రమౌళిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అయితే, కాల్పులు జరిగిన సుమారు 3 గంటల అనంతరం చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు హుటాహుటిన పహల్గాంకు బయలుదేరారు. ఇక దాడిలో నెల్లూరు జిల్లా కావలికి చెందని మధుసూదన్ ప్రాణాలు కోల్పోయారు. అయితే, మధుసూదన్ (Madhusudan) కుటుంబం ఇటీవలే బెంగళూరు (Bengaluru)లో స్థిరపడింది. ఈ క్రమంలోనే ఆయన ఫ్యామిలీతో కలిసి కశ్మీర్ (Kashmir) పర్యటనకు వెళ్లగా మధుసూదన్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.






