Ap: కాలర్ ఎగరేసేలా పాలన...!

by Vemula.Srinu Prasad |

పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, క్రమశిక్షణకు ప్రతి కార్యకర్త కట్టుబడి ఉండాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ...

Ap: కాలర్ ఎగరేసేలా పాలన...!
X

దిశ, వెబ్ డెస్క్: పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, క్రమశిక్షణకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని కార్యకర్తలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Tdp Chief Chandrababu Naidu) పిలుపునిచ్చారు. పార్టీ విజయాలకు కార్యకర్తలే మూలస్తంభాలని, వారి కృషితోనే ఈ స్థాయిలో ఉన్నామనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. మంగళగిరి పార్టీ(Mangalagiri) కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌(Ntr Bhavan)లో టీడీపీ(Tdp) 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, కార్యకర్తలు గర్వంగా తలెత్తుకునేలా పారదర్శకమైన పాలన అందిస్తున్నామన్నారు. నాయకత్వ పటిమను పెంచేందుకు నిరంతరం శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యకర్తలకు రాజకీయ సాధికారత కల్పించడమే తమ ప్రధాన ధ్యేయమని చెప్పారు. అన్ని రకాల పదవుల్లో కార్యకర్తలకు అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయంగానే కాకుండా సామాజికంగా కూడా పార్టీ శ్రేణులకు గుర్తింపు ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు.

ఆర్థికంగా అండగా ఉంటాం


అలాగే కార్యకర్తల ఆర్థిక సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించామని చంద్రబాబు తెలిపారు. కార్యకర్తలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ప్రతి కార్యకర్త కుటుంబం సుభిక్షంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Next Story