కావూరి మృతి పట్ల లోకేష్, చంద్రబాబు సంతాపం

by Naga Rani Yarlagadda |

కేంద్రమాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ సంతాపం ప్రకటించారు.

కావూరి మృతి పట్ల లోకేష్, చంద్రబాబు సంతాపం
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి కావూరి సాంబశివరావు అనారోగ్య సమస్యలతో బుధవారం ఉదయం హైదరాబాద్ స్టార్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. ఆయన మృతి అత్యంత బాధాకరమని చంద్రబాబు పేర్కొన్నారు. మచిలీపట్నం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచి, కేంద్రమంత్రిగా పనిచేసిన ఆయన మరణం తీరని లోటన్నారు. రాజకీయ, వ్యాపార రంగంలో కావూరి ప్రత్యేక ముద్ర వేశారన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

తమ బంధువైన కావూరి సాంబశివరావు మృతిపట్ల నారా లోకేశ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఐదుసార్లు ఎంపీగా గెలిచి, కేంద్రమంత్రిగా పనిచేసి, రాష్ట్ర ప్రగతి కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. తన నియోజకవర్గ పరిధిలో చెరగని ముద్ర వేశారని, ఆయన సేవలు చిరస్మరణీయమని లోకేశ్ పేర్కొన్నారు. కావూరి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Next Story