- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ, ఉన్నత విలువలకు ప్రతిరూపం ఎర్రన్నాయుడు : CM చంద్రబాబు
by Naga Rani Yarlagadda |
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు.. కేంద్రమాజీ మంత్రి ఎర్రన్నాయుడికి ఆయన వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు.. కేంద్రమాజీ మంత్రి ఎర్రన్నాయుడికి ఆయన వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఎర్రనాయుడు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా, ఉన్నత విలువలకు ప్రతిరూపంగా నిలిచారని కొనియాడుతూ సీఎం ఎక్స్ లో పోస్ట్ చేశారు. అంతేకాక ఉత్తమ పార్లమెంటేరియన్ గా జాతీయ రాజకీయాల్లోనూ తనదేన ముద్ర వేసిన తెలుగుతేజం, తన ఆత్మీయ నేస్తం లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిదన్నారు.
దివంగత మాజీ మంత్రి ఎర్రన్నాయుడు.. ఉత్తరాంధ్ర అభివృద్ధితోపాటు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చివరి శ్వాస వరకు కృషి చేశారని, రాజకీయాల్లోతనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.
Next Story






