అమర జవాన్ మురళీ నాయక్‌కు సీఎం, గవర్నర్ నివాళి

by Naga Rani Yarlagadda |

దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీనాయక్ కు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazir) నివాళులు అర్పించారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాలో ఉన్న మురళీ నాయక్ కుటుంబ సభ్యుల్ని సీఎం చంద్రబాబు ఫోన్ లో పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అమర జవాన్ మురళీ నాయక్‌కు సీఎం, గవర్నర్ నివాళి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా - పాకిస్థాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఏపీకి చెందిన జవాన్ మురళీ నాయక్ (Jawan Murali Nayak) అమరవీరుడయ్యాడు. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీనాయక్ కు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazir) నివాళులు అర్పించారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాలో ఉన్న మురళీ నాయక్ కుటుంబ సభ్యుల్ని సీఎం చంద్రబాబు ఫోన్ లో పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. దాయాది దేశం జరిపిన కాల్పుల్లో మురళీ నాయక్ మరణించడం బాధాకరమన్నారు. అమరవీరుడైన జవాన్ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో మురళీ నాయక్ మరణించాడన్న విషయం తెలిసిన కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. దేశాన్ని రక్షించేందుకు సైనికుడిగా వెళ్లిన మురళీ.. విగతజీవుడవుతాడని ఊహించలేదని కల్లితండా వాసులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మురళీ నాయక్ పార్థివదేహం శనివారం ఉదయం స్వగ్రామానికి రానుండగా.. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి.

Next Story