- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ ప్రజలకు బిగ్ డే.. నేడే క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన
రాష్ట్రంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమరావతిలో నిర్మించతలపెట్టిన క్వాంటమ్ వ్యాలీకి నేడు శంకుస్థాపన జరుగనుంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమరావతిలో నిర్మించతలపెట్టిన క్వాంటమ్ వ్యాలీకి సీఎం చంద్రబాబు నాయుడు.. కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తో కలిసి నేడు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తుళ్లూరు మండలం ఉద్ధండరాయుని పాలెంలో ఈ వేడుక జరగనుంది.
క్వాంటమ్ టెక్నాలజీలో ఏపీని అగ్రగామిగా నిలిపాలన్న లక్ష్యంతోనే దీని రూపకల్పన జరుగుతోంది. దేశంలో క్వాంటమ్ విప్లవానికి నాయకత్వం వహించే దిశగా.. రాష్ట్రం అడుగులు వేస్తోంది. ఈ క్వాంటమ్ వ్యాలీ కోసం ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. దేశంలో మొదటి 133 క్యూబిక్ క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి రానుండగా.. ఈ క్వాంటమ్ వ్యాలీలో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ కీలకపాత్ర వహించనున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సార్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పరిశోధనలు జరగనున్నాయి. అలాగే సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ వంటి రంగాల్లోనూ రీసెర్చులు చేయనున్నారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి క్వాంటమ్ వ్యాలీ భవనాన్ని సిద్ధం చేసేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. డిసెంబరు నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు.. నేడు రాష్ట్ర చరిత్రలో మరచిపోలేని రోజుగా మిగులుతుందని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 1990లలో భారత్ ను ఐటీ మ్యాప్ పై నిలిపిన ప్రయాణమే.. నేడు క్వాంటమ్ మ్యాప్ పై భారత్ ను అగ్రస్థానంలో నిలిపే దశకు చేరుకుందని పేర్కొన్నారు. నేడు నూతన ప్రయాణానికి అమరావతి కేంద్రబిందువుగా మారనుందని, రాష్ట్ర చరిత్ర మారే రోజుగా గుర్తుండిపోతుందని తెలిపారు.






