Clean Energy: భారత్​లో క్లీన్​ ఎనర్జీ విప్లవం.. దానికి ఆంధ్రప్రదేశ్​లోనే నాంది

by Thanuru Gopichand |

భారత్​లో క్లీన్​ఎనర్జీ విప్లవం రాబోతోందని .. దానికి ఏపీ నాంది పలుకుతోందని మంత్రి నారా లోకేశ్​ తెలిపారు.

Clean Energy: భారత్​లో క్లీన్​ ఎనర్జీ విప్లవం.. దానికి ఆంధ్రప్రదేశ్​లోనే నాంది
X
2 వేల కోట్లతో రెన్యువబుల్ ఎనర్జీ కాంప్లెక్స్

దేశానికి సౌరవిద్యుత్​ను అందిస్తాం

మనకు ఏ బ్రాండ్లు లేవు.. చంద్రబాబే ఏపీకి బ్రాండ్

త్వరలో కర్నూలుకు హైకోర్టు బెంచి తీసుకొస్తాం

నరేంద్ర మోడీని రాయలసీమకు పిలుస్తాం

మంత్రి నారా లోకేశ్​వెల్లడి

దిశ, డైనమిక్​ బ్యూరో : భారత్​లో క్లీన్​ఎనర్జీ విప్లవం రాబోతోందని .. దానికి ఏపీ నాంది పలుకుతోందని మంత్రి నారా లోకేశ్​ (Nara Lokesh) తెలిపారు. భవిష్యత్తు ఆశలు, ఆకాంక్షలకు వారధిగా రెన్యువబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ (renewable energy complex) ఉంటుందన్నారు. రెన్యువబుల్ ఎనర్జీ పరిశ్రమ మాత్రమే కాదు ఒక ఉద్యమం అన్నారు. అనంతపురం జిల్లా బేతేపల్లిలో సోలార్‌ ప్లాంట్‌కు నేడు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. దేశంలో అతిపెద్ద రెన్యువబుల్‌ పవర్‌ కాంప్లెక్స్‌గా బేతేపల్లి సోలార్‌ ప్లాంట్‌ ను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు రూ.22 వేల కోట్లతో ప్రాజెక్ట్‌ నిర్మాణం జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక టార్గెట్ పెడితే తాము సీరియస్ గా తీసుకుంటామని అన్నారు. అందులో భాగంగానే దావోస్​లో గ్రీన్​ఎనర్జీ (Green Energy) ఒప్పందం కుదుర్చున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల రాబోయే రోజుల్లో మనకు విద్యుత్ చార్జీలు తగ్గుతాయన్నారు. గడిచిన ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్క మెగా వాట్ కూడా రాలేదన్నారు. అనంతపురానికి తాము కియా మోటార్ల పరిశ్రమను వచ్చామన్నారు. ఇటువంటి కొత్త ప్రాజెక్టులు తీసుకువచ్చి కరెంటు చార్జీలు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.

ఒకే రాష్ట్రం, ఒకటే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కర్నూలు లో హైకోర్టు బెంచిని తీసుకొస్తామని.. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పిలుస్తామని అన్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి బ్రాండ్లు తనకు లేవని.. చంద్రబాబు (Chandrababu) మాత్రమే ఏపీకి బ్రాండ్ అని తెలిపారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ దావుస్ లో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టు ఇక్కడ వచ్చిందన్నారు. దీని ద్వారా యువతకు పెద్ద ఎత్తున కల్పన జరుగుతుందన్నారు. రైతులకు కౌలు ద్వారా మేలు జరుగుతుందని అన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో 77 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు తీసుకొచ్చామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకురాలేకపోయింద ని ఆరోపించారు. రాయలసీమ ప్రాంతం సోలార్ విద్యుత్తుకు అనువైనది అని తెలిపారు. ఈ ప్రభుత్వం పై నమ్మకంతో గతంలో వెళ్లిపోయిన వారు కూడా తిరిగి పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు.

Next Story