- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శింగనమలలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాల బాహాబాహి
అనంతపురం జిల్లా శింగనమల తెలుగుదేశం పార్టీలో వర్గ పోరు తారా స్థాయికి చేరింది...

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా శింగనమల తెలుగుదేశం పార్టీ(Singanamala Telugu Desam Party)లో వర్గ పోరు తారా స్థాయికి చేరింది. ఎమ్మెల్యే శ్రావణి(MLA Shravani) అనుకూల, వ్యతిరేక వర్గాల బాహాబాహికి దిగాయి. ఇన్‌చార్జ్ మంత్రి టీజీ భరత్(Minister TG Bharat) ఎదుటే గొడవకు దిగారు. అంతేకాదు మంత్రికి శ్రావణిపై వ్యతిరేక వర్గం ఫిర్యాదు చేసింది.
కాగా శింగనమల టీడీపీలో రెండు గ్రూపులు తయారయ్యారు. ఎమ్మెల్యే శ్రావణి... టూమెన్ కమిటీ వర్గాలుగా విడిపోయాయి. నియోజకవర్గంలో ప్రభుత్వానికి సంబంధించి అన్ని పనులను ఎమ్మెల్యే శ్రావణి వర్గీయులు దక్కించుకున్నారు. దీంతో టూమెన్ కమిటీ అడ్డుతగులుతోంది. మరోవైపు సీనియర్లు సైతం ఎమ్మెల్యే శ్రావణిని బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో టీడీపీలో వర్గపోరు కొనసాగుతోంది. ఈ విషయం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా కూడా మరోసారి వర్గపోరు బయటపడింది. పరస్పరం కొట్టుకునే వరకు వెళ్లింది.






