- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking:పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మే 19వ తేదీ నుంచి 28 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే.

X
దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మే 19వ తేదీ నుంచి 28 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయో అని ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఏపీ(Andhra Pradesh) ఎస్‌ఎస్‌సీ బోర్డు(SSC Board) పదో తరగతి సప్లిమెంటరీ(AP SSC Supplementary Results) ఫలితాలను విడుదల చేసింది. ఈమేరకు ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు తాజాగా ప్రకటించింది. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://bse.ap.gov.in/ లేదా వాట్సాప్ మనమిత్ర నెంబర్ 95523 00009 ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మొత్తంగా 1,23,477 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 76.14శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. బాలురు 73.55 శాతం, బాలికలు 80.10శాతం ఉత్తీర్ణత నమోదైంది.
Next Story






