రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టిన లవ్ మ్యారేజ్.. పొట్టుపొట్టు కొట్టుకున్న గ్రామస్థులు

by Ajay Maddhiboyina |

ప్రేమ వివాహాలు సాధారణంగా రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెడుతుంటాయి.

రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టిన లవ్ మ్యారేజ్.. పొట్టుపొట్టు కొట్టుకున్న గ్రామస్థులు
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రేమ వివాహాలు సాధారణంగా రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెడుతుంటాయి. కులాలు వేరనో, మతాలు వేరనో లేదా ఫైనాన్షియల్ స్టేటస్ వేరు అనో పెళ్లికి నారాకరిస్తూ కుటుంబాలు గొడవపడతాయి. కానీ ఏపీలో ఒక ప్రేమ వివాహం ఏకంగా రెండు గ్రామాల మధ్యనే చిచ్చు పెట్టింది. రెండు గ్రామాల ప్రజలు పొట్టుపొట్టు కొట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే... ఏలూరులోకి కైకలూరు మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని చటకాయ గ్రామానికి చెందిన ఘంటసాల రోజాకుమార్ నత్తగుళ్లపాడుకు చెందిన లక్ష్మి ప్రసన్న కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

వీరిద్దరూ శుక్రవారం ప్రేమ వివాహం చేసుకుని జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం పోలీసులను ఆశ్రయించారు. ఇరువర్గాల పెద్దల సమక్షంలో జంటను కైకలూరు తీసుకెళుతుండగా శ్రీపుర్రు సమీపంలో చటకాయ గ్రామస్థులపై నత్తగుళ్లపాడు గ్రామస్థులు సినీఫక్కిలో దాడి చేశారు. ఇరు వర్గాలు దాడి చేసుకోగా పలువురికి గాయాలయ్యాయి. గాయపడినవారిని పోలీసులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడినవారిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

Next Story