- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీగా కుటుంబ తగాదా కేసులు: సీజేఐ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు
మన దేశంలో కుటుంబ తగాదా కేసులే భారీగా పెరుగుతున్నాయని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీకి ఆయన శంకుస్థాపన చేశారు...

దిశ, వెబ్ డెస్క్: మన దేశంలో కుటుంబ తగాదా కేసులే భారీగా పెరుగుతున్నాయని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్(CJI Justice Suryakant) అన్నారు. అమరావతి(Amaravati)లో మధ్యవర్తిత్వంపై జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సకు హాజరైన ఆయన న్యాయ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. అటు మధ్యవర్తిత్వం(Mediation)పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వంతో చాలా ఈజీగా మధ్యవర్తిత్వం వహించే వారికి శిక్షణ ఇవ్వడం చాలా కీలకం: సీజేఐ పరిష్కారవుతాయన్నారు. ప్రతీ సమస్యపై కోర్టుకు వెళ్లడమనేది పరిష్కారం కాదని, మధ్యవర్తిత్వంతోనే న్యాయం జరుగుతుందని ఇరుపక్షాలు నమ్మాలని సూర్యకాంత్ సూచించారు. కొన్ని సమయాల్లో కోర్టులు కూడా మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. వాణిజ్యం, వ్యాపారపరంగా చాలా వివాదాలు రావడం సహజమని చెప్పారు. మలేషియాలోని లీగల్ బార్ చాలా కీలకంగా వ్యవహరిస్తోందని, మనదేశంలోనూ అలాంటివి కొనసాగాలని ఆకాక్షించారు. మధ్యవర్తిత్వం వహించే వారికి శిక్షణ ఇవ్వడం చాలా కీలకమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.






