- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలోని నగరాలు.. ముంబై తరహా అభివృద్ధి
ఏపీలోని నగరాలను ముంబై తరహా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

దిశ, డైనమిక్బ్యూరో : ఏపీలోని నగరాలను ముంబై తరహా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ముంబైలో మంత్రి నారాయణ, సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు పర్యటిస్తున్నారు. ఈ రోజు వారిద్దరూ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ, సిడ్కో అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంఎంఆర్డీఏ ప్లానింగ్ డైరెక్టర్ శంకర్ దేశ్ పాండే, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. ముంబయి అభివృద్ధిలో ఎంఎంఆర్డీఏ కీలక పాత్ర వహిస్తోంది. ముంబయి లో రోడ్లు, మెట్రో రైలు, హౌసింగ్ ప్రాజెక్టులు ఇది చేపడుతోంది. రోడ్లు అభివృద్ధి, మెట్రో రైలు ప్లానింగ్, రవాణా ప్రణాళికలు, ఇళ్ల నిర్మాణం, రీజినల్ డెవలప్మెంట్, నిధుల సమీకరణ పై మంత్రి నారాయణకు ముంబై అధికారులు వివరించారు. ముంబయి మహానగరంలో విదేశీ పెట్టుబడుల సహకారంతో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్న విధానాన్ని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం నిధుల సమీకరణ చేస్తున్న విధానాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. ముంబై మహానగర అభివృద్ధి లో ఎంఎంఆర్డీయే తీసుకుంటున్న విధానాలను ఏపీలోని నగరాల అభివృద్ధికి అనుసరించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.






