సినిమా నా బిజినెస్ ​కాదు.. అందరు హీరోలలో నేను ఒకడిని: పవన్​ కల్యాణ్​

by Malleboina Mahesh |   (  Updated:2025-07-21 06:56:38  IST  )

సినిమా నాకు బిజినెస్​ కాదని ఉపముఖ్యమంత్రి పవన్​కల్యాణ్​అన్నారు.

సినిమా నా బిజినెస్ ​కాదు.. అందరు హీరోలలో నేను ఒకడిని: పవన్​ కల్యాణ్​
X

దిశ, డైనమిక్​బ్యూరో: సినిమా నాకు బిజినెస్​ కాదని ఉప ముఖ్యమంత్రి పవన్​ కల్యాణ్​ (Deputy Chief Minister Pawan Kalyan) అన్నారు. ఈ రోజు హైదరాబాద్​లో హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్‌లో ఆయన మాట్లాడుతూ.. మిగతా సినిమా హీరోల కంటే తాను తక్కువే రెమ్యూనరేషన్ ​తీసుకుంటానని అన్నారు. నా కాంపిటీటివ్‌నెస్​ సినిమా ఎప్పుడూ పెట్టలేదన్నారు. చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోలలో నేను ఒకడిని మాత్రమే అన్నారు. నేను కోట్లాది మంది సమస్యలకు స్పందిస్తానని తెలిపారు. గత ప్రభుత్వంలో తెలుగు సినిమా పరిశ్రమను ఎంత ఇబ్బందులు పెట్టారో తెలుసన్నారు. మేము అధికారంలోకి రాగానే చిత్ర పరిశ్రమను హృదయ పూర్వకంగా ఆహ్వానించామన్నారు. వారి నుంచి ఎటువంటి కృతజ్ఞత కూడా కోరుకోలేదన్నారు.

సినిమా బతకాలని మేమంతా కోరుకుంటున్నామని తెలిపారు. మనం అంతా కులాలు, మతాలు, ప్రాంతాలు, భాష పేరుతో కొట్టుకుంటామని అన్నారు. చిత్ర పరిశ్రమలో కుల మత, ప్రాంతీయ, భాష, అంతరాలు లేవన్నారు. చిరంజీవి తమ్ముడైనా అది మేటర్​ కాదన్నారు. సత్తా లేకపోతే ఇక్కడ ఉండలేరన్నారు. అది నా కుమారుడు అయినా సరే అన్నారు. తర్వాత నేను సినిమాలు చేస్తానో లేదో నాకు తెలియదన్నారు. ఏఎం రత్నాన్ని ఏపీ ఫిలిం డెవలప్​మెంట్ ​కార్పొరేషన్​ చైర్మన్ (Film Development Corporation Chairman)​గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నేను ప్రతిపాదించానని తెలిపారు. ఇలాంటి వ్యక్తి ఉంటే మా తెలుగు చిత్ర పరిశ్రమ (Telugu film industry) బాగుంటుందన్నారు.

Also Read: నాకు ఇష్టం లేదు.. రత్నం గారి కోసం ప్రెస్ మీట్: పవన్ కల్యాణ్

Next Story