AP News : ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసిన సీఐడీ

by Muthe.Rajitha |

ఆంధ్రప్రదేశ్‌(AP)లోని మంగళగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(YCP Former MLA Alla Ramakrishna Reddy) పై సీఐడీ(CID) కేసు నమోదు చేసింది.

AP News : ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసిన సీఐడీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌(AP)లోని మంగళగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(YCP Former MLA Alla Ramakrishna Reddy) పై సీఐడీ(CID) కేసు నమోదు చేసింది. మంగళగిరి(Managalagiri TDP Ofc Attack Issue)లో 2021 అక్టోబర్ 19న టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే)పై సీఐడీ పోలీసులు నేడు కేసు నమోదు చేశారు. ఆయన్ను 127వ నిందితుడిగా చేర్చారు. ఈ దాడిలో వైఎస్ఆర్‌సీపీ నాయకులు, వారి అనుచరులు టీడీపీ ఆఫీసును ధ్వంసం చేసి, ఫర్నిచర్, వాహనాలను నాశనం చేశారని ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఘటన టీడీపీ నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత జరిగింది. సీఐడీ ఈ కేసు విచారణను వేగవంతం చేసింది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కోసం గుంటూరు కోర్టును ఆశ్రయించారు, ఈ పిటిషన్‌ను మే 28, 2025న విచారించనున్నారు.

Next Story