- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
క్వశ్చన్స్ మిగిలిపోయాయ్: చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ పిటిషన్

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ మరోసారి కస్టడీ కోరింది. ఈ మేరకు సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరో ఐదు రోజులపాటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో సీఐడీ కోరింది. ఇకపోతే ఇప్పటికే సీఐడీ చంద్రబాబు నాయుడును రెండు రోజులపాటు కస్టడీకి తీసుకుంది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రెండురోజులపాటు విచారించింది. అయితే ఈ రెండు రోజుల విచారణలో చంద్రబాబు నాయుడు సహకరించలేదు అని సీఐడీ ఆరోపించింది. 120 ప్రశ్నలు జాబితా సిద్ధం చేశామని అయితే అందులో కేవలం 60 ప్రశ్నలకు మాత్రమే చంద్రబాబు నాయుడు మాత్రమే సమాధానం చెప్పారని మిగిలిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. ఈ ప్రశ్నలను విచారించేందుకు మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉంటే చంద్రబాబు కస్టడీ విచారణకు సంబంధించిన నివేదికను సీఐడీ అధికారులు సీల్డ్ కవర్‌లో సమర్పించారు. దానితో పాటు చంద్రబాబు ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ కూడా దాఖలు చేశారు. చంద్రబాబు విచారణకు సహకరించడం లేదని..కస్టడీ పొడిగించాలని సీఐడీ కోరింది.
కస్టడీ ఇచ్చేనా?
ఇకపోతే మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై విచారణ జరగాల్సి ఉంది. అయితే చంద్రబాబు కస్టడీ పొడిగింపుపై దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు వినాలని సీఐడీ తరఫు న్యాయవాదులు కోరారు. అయితే మెమో ఫైల్ చేయాలని సీఐడీకి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. కస్టడీ పొడిగింపు మెమో సీఐడీ ఫైల్ చేసిన తర్వాత విచారణ చేస్తామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చెప్పారు. ఇకపోతే చంద్రబాబును కస్టడీకి ఇచ్చే అంశంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు విచారణకు సహకరించలేదని అందువల్ల మరోసారి సీఐడీ కస్టడీ కోరింది. అయితే మరోసారి కస్టడీ ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ అయిన 15 రోజుల్లోనే అత్యధికంగా కస్టడీకి జడ్జిలు అనుమతి ఇస్తారని అనంతరం ఇవ్వరు అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి 17 రోజులు కావస్తున్న నేపథ్యంలో మరోసారి కస్టడీ అనేది అసాధ్యంగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు అరెస్టై 15 రోజులకు రెండు రోజులు ఉంది. ఆసమయంలో సీఐడీ కస్టడీ కోరడంతో ఆ రెండురోజులు కస్టడీకి ఏసీబీ కోర్టు జడ్జి అనుమతినిచ్చారు. ఇకపోతే 17 రోజులు దాటుతున్న నేపథ్యంలో చంద్రబాబును కస్టడీకి ఇచ్చే అవకాశం దాదాపుగా లేదని కొందరు న్యాయవాదులు చెప్తున్నారు.