Breaking News: నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-09-30 11:43:46  IST  )

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు అందించింది...

Breaking News: నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు అందించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయన ఏ14 నిందితుడిగా ఉన్నారు. దీంతో లోకేశ్‌కు సీఆర్పీసీ 41(A) కింద అధికారులు నోటీసులు అందజేశారు. ఢిల్లీలో ఉన్న నారా లోకేశ్‌ను సీఐడీ బృందం కలిసింది. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విజయవాడ సీఐడీ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులో అధికారులు పేర్కొన్నారు.

కాగా ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్‌లో మార్పులు జరిగాయని సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. టీడీపీ హయాంలో తమ వారి భూములకు ధరలు వచ్చే విధంగా ఇన్నర్ రింగు రోడ్డును డిజైన్ చేశారని సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ మేరకు విచారణ చేపట్టింది. అప్పుడు మంత్రిగా పని చేసిన నారా లోకేశ్‌ను నిందితుడిగా చేర్చింది. ఇందులో భాగంగా ఆయనను విచారించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రెండు వారాలుగా ఢిల్లీలో ఉంటున్న లోకేశ్‌ను కలిసి నోటీసులు అందజేసింది.

Next Story